Sunday, May 3, 2009

గిద్దలూరు గురించి క్లుప్తంగా


గిద్దలూరు అనే ఊరు దట్టమైన నల్ల్లమల అడవులకు బాగా దగ్గరిగా ఉన్నా ప్రాంతం ఎటు చూసినా నాలుగు వైపులా కొండలె కానీ ఊరు మాత్రం నాలుగూ కొండల మద్యన ఎత్తులో సహజంగా ఏర్పడింది, అందుకే దీనికి రాక్షస గడ్డ అనే పేరొచ్చింది, ఊరికి 10నుండి 15 కిలోమీటర్ల పడమరగా నల్లమల అడవులు ప్రారంభం అవుతాయి, ఇది చాల దట్టమైన అడవి కాని వాతావరణం ఎంతొ ఆహ్లాదంగా పచ్చగా ఉంటుంది, ఈ దారిలో బైక్ షికారు బాగా ఉంటుంది, దారిలో వాతావరణం చాల బాగా వుంటుంది విహారానికి కుటుంబంతో సహ వెళితే ఎంతో ఆనందగా ఉంటుంది, అడవి దాటి కొద్ది దూరం వెళ్తే అక్కడ ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉంది. అలాగే గిద్దలూరు కు దక్షిణంగా 25కిలోమీటర్లు వెళితే ఆదిముర్తి పల్లె దగ్గర కడప సరిహద్దు మొదలవుతుంది గిద్దలూరుకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ ప్రాంతంలో సిద్దులు అనే ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండే వారట అందువల్ల ఈ ప్రాంతాన్ని సిద్దలూరు అని పిలిచేవారట కాలక్రమంలో అది కాస్త గిద్దలూరు గా ప్రసిద్దికెక్కింది, గిద్దలూరు లో ప్రాచినకాలం నాటి శివాలయం ఉన్నది అదే పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఊరిలొ కొండ మీద ఉన్నటువంటి నరసింహ స్వామి దేవస్థానం ప్రసిద్దమైనది, అలాగే కొండపేట ఆంజనేయ స్వామి దేవస్థానం, అలాగే కొప్పు వారి వీధిలో ఉండే పురాతన దర్గా కూడా చాల ప్రసిద్దమైంది మరియు పురాతనమైనది ఇందులో విశేషం ఏమిటంటే పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం లో మరియు కొప్పువారి వీధిలో ఉండే రాజాపీర్ హుస్సేన్ దర్గాలో చాల దూరమైనా సొరంగ మార్గాలు ఉన్నాయి. అలాగే గిద్దలూరు బద్వేలు దారిలో ఉండే ఖాదర్ వాలి దర్గా కూడా బాగా పురాతనమైనది, అలాగే రైల్వే స్టేషన్ కు అవతల కొండ మీద ఉండే దర్గా కూడా చాల ప్రసిద్దమైనది, ఈ దర్గాలలో ప్రతి సంవత్సరం ఉరుసులు జరుగుతాయి. ఇంకా నెమలి గుండ్ల రంగ నాయకా స్వామి దేవస్థానం దట్టమైన నల్లమల అడవుల్లో ప్రతి సంవత్స్తరం అత్యంత వైభవంగా తిరునాళ్ళ జరుగుతుంది.

5 comments:

vasantam said...

అభినందనలు! మీ ప్రయత్నం చాలా బావుంది.మీరు మీకు తెలిసినంత వరకు గిద్దలూరు ఇంక చుట్టూ పక్కల వూర్ల గురించి వ్రాయండి.తరువాత మీరు తెలుగు వికీపెడియా లో ఈ మొత్తము సమాచారాన్ని గిద్దలూరు శీర్షిక క్రింద వరుసగా వ్రాస్తే అందరికి ఉపయోగం మరియు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఒక చక్కటి రికార్డుగా ఉంటుంది. మీ కామెంట్ వ్రాయండి.
తెలుగు వికీపెడియా link : http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81

PS:సెర్చ్ లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు>మండలాలు >గిద్దలూరు కి వెళ్ళగలరు.

సుజాత వేల్పూరి said...

మీకు దగ్గరలోని బనగానె పల్లెలో ఉన్న బ్రహ్మం గారి మఠం గురించి అక్కడ జరిగే కార్యక్రమాలగురించి కూలంకషంగా రాయండి.తెలుసుకోవాలని ఉంది.

vasantam said...

కొత్త రూపములో మన బ్లాగ్ బోలెడు ఫొటోలతో సింగారించుకుని అందంగా ఉంది.కచేరి ఫోటో,నరసింహ స్వామి గుడి,కొండ ఇంకా కొండ మీద నుండి టాప్ యాంగిలులో టౌన్,కొండపేట ఆంజనేయ స్వామి గుడి,చర్చి(ఆర్ అండ్ బి ఆఫీసు పక్కన),నర్సరీ,ఆర్టీసీ బస్టాండ్, రాచర్ల కు వెళ్ళే దారిలో కొత్తగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి, థియేటర్ల ఫోటోలు కూడా పెట్టండి. ఫోటోలకి లింకులిచ్చి వేరే పేజీలో పెద్ద ఫోటోలు వచ్చే లాగ చేస్తే ఇంక ఉపయోగకరంగా వుంటుందేమో ఆలోచించండి.
చాల చక్కగా, శ్రమతో బ్లాగుని తీర్చి దిద్దుతున్నందుకు అందుకోనండి మా అభినందన మందార మాల.

Sujata M said...
This comment has been removed by the author.
Sujata M said...

అయ్యా.. గిద్దలూరు లో చాలా మంది సైనికులున్నారు. ఇది చాలా ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఈ విషయం అస్సలు ప్రస్తావించడం లేదు. ఒక సారి చెక్ చెయ్యండి. గిద్దలూరు లో ఎందరో మాజీ సైనికోద్యోగులూ, కార్గిల్ వీరులు, ప్రస్తుతం సైన్యం లో (త్రివిధ దళాలలోనూ) పని చేస్తున్న వారూ ఉన్నారు. వీరికి ఒక సంఘం కూడా ఉంది. వీరి కోసం ప్రభుత్వ యంత్రాంగమే, వీరి మీది గౌరవంతో, వీరి ముంగిటికి వచ్చి కాంటీన్, హాస్పిటల్ సౌకర్యాలు కలిపించబోతోంది. ఇంకో ఆరు నెలలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక, అప్పుడన్నా, న్యూస్ పేపర్ లలో ఈ వీర సైనికుల గ్రామం గురించి వేస్తారేమో చూడాలి. ఇంతకు ముందు నాకు ఈ పేరు గురించి సందేహం ఉండేది. ఇప్పుడు మాత్రం అనుమానం లేదు.