Tuesday, May 5, 2009

నాకు పంపండి

మీరు మీ అభిప్రాయాలను ప్రపంచంలోని వారితో పంచుకోడానికి మీ అబిప్రాయం ను నా మెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయండి, మీరు పంపిన మెయిల్ ను మేము ఈ బ్లాగ్ లో ఉంచుతాము , ఒక వేళ మీరు తెలుగులో మెస్సేజ్ పంపించడానికి ఇంగ్లీష్ లోనే తెలుగును టైపు చేసి పంపించండి అది ఈ బ్లాగ్ లో తెలుగులో తీసుకుంటుంది , మీరు మెయిల్ పంపవలసిన అడ్రస్ gadikotachakri@gmail.com
చక్రి గడికోట

Sunday, May 3, 2009

గిద్దలూరు గురించి క్లుప్తంగా


గిద్దలూరు అనే ఊరు దట్టమైన నల్ల్లమల అడవులకు బాగా దగ్గరిగా ఉన్నా ప్రాంతం ఎటు చూసినా నాలుగు వైపులా కొండలె కానీ ఊరు మాత్రం నాలుగూ కొండల మద్యన ఎత్తులో సహజంగా ఏర్పడింది, అందుకే దీనికి రాక్షస గడ్డ అనే పేరొచ్చింది, ఊరికి 10నుండి 15 కిలోమీటర్ల పడమరగా నల్లమల అడవులు ప్రారంభం అవుతాయి, ఇది చాల దట్టమైన అడవి కాని వాతావరణం ఎంతొ ఆహ్లాదంగా పచ్చగా ఉంటుంది, ఈ దారిలో బైక్ షికారు బాగా ఉంటుంది, దారిలో వాతావరణం చాల బాగా వుంటుంది విహారానికి కుటుంబంతో సహ వెళితే ఎంతో ఆనందగా ఉంటుంది, అడవి దాటి కొద్ది దూరం వెళ్తే అక్కడ ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉంది. అలాగే గిద్దలూరు కు దక్షిణంగా 25కిలోమీటర్లు వెళితే ఆదిముర్తి పల్లె దగ్గర కడప సరిహద్దు మొదలవుతుంది గిద్దలూరుకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ ప్రాంతంలో సిద్దులు అనే ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండే వారట అందువల్ల ఈ ప్రాంతాన్ని సిద్దలూరు అని పిలిచేవారట కాలక్రమంలో అది కాస్త గిద్దలూరు గా ప్రసిద్దికెక్కింది, గిద్దలూరు లో ప్రాచినకాలం నాటి శివాలయం ఉన్నది అదే పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఊరిలొ కొండ మీద ఉన్నటువంటి నరసింహ స్వామి దేవస్థానం ప్రసిద్దమైనది, అలాగే కొండపేట ఆంజనేయ స్వామి దేవస్థానం, అలాగే కొప్పు వారి వీధిలో ఉండే పురాతన దర్గా కూడా చాల ప్రసిద్దమైంది మరియు పురాతనమైనది ఇందులో విశేషం ఏమిటంటే పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం లో మరియు కొప్పువారి వీధిలో ఉండే రాజాపీర్ హుస్సేన్ దర్గాలో చాల దూరమైనా సొరంగ మార్గాలు ఉన్నాయి. అలాగే గిద్దలూరు బద్వేలు దారిలో ఉండే ఖాదర్ వాలి దర్గా కూడా బాగా పురాతనమైనది, అలాగే రైల్వే స్టేషన్ కు అవతల కొండ మీద ఉండే దర్గా కూడా చాల ప్రసిద్దమైనది, ఈ దర్గాలలో ప్రతి సంవత్సరం ఉరుసులు జరుగుతాయి. ఇంకా నెమలి గుండ్ల రంగ నాయకా స్వామి దేవస్థానం దట్టమైన నల్లమల అడవుల్లో ప్రతి సంవత్స్తరం అత్యంత వైభవంగా తిరునాళ్ళ జరుగుతుంది.

గిద్దలూరులో ప్రదాన కుడళ్ళు -1

గిద్దలూరు లో ప్రధానంగా బద్వేల్ రోడ్ లో గాంధీ బొమ్మ ప్రాంతం బాగా ప్రదానమైనది అని చెప్పుకొనవచ్చు, దీనిని ఒకప్పుడు కస్సేట్టి వారి అంగడి అనే పేరు ఉండేది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భవంతి ఇప్పటికి మనకు కనపడుతుంది, అలాగే కొంచెం ముందుకు వెళితే అక్కడ రాజస్థాన్ హోటల్ ఉండే ప్రాంతం కూడా బాగా పేరు పొందిందే ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు పూరి దొరుకుతుంది, ఇక ఈ ఏరియా లో ఇంకో విషయం ఏమిటంటే గురవయ్య పాన్ షాప్ ఇక్కడ ఎంతో మంచి కిల్లిలు దొరుకుతాయి అలాగే ప్రక్కనే రాజస్థాన్ స్వీట్ బళ్ళు, ప్రక్కనే సురే వాళ్ల ఎలక్ట్రానిక్ షాప్ లు, బుక్ షాప్స్ ఇంక ఈ ఏరియా లో పూల కోట్లు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే సాయిబాబా గుడి వస్తుంది, ఇది ఉరిలో ఒక ఆద్యాత్మిక ప్రదేశం, ఇందులో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అలా నేరుగా వెలితే కుమ్మరం కట్ట వస్తుంది , అటునుండి నంద్యాల ఒంగోలు ప్రధాన రహదారి వస్తుంది, ఎడమ వైపు నంద్యాల వెళ్ళే దారి కుడి వైపు గిద్దలూరు రైల్వే స్టేషన్ వస్తుంది, ఈ ప్రాంతం కూడా ప్రధానమైనది, గిద్దలూరు రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల కోట్ల లో రైల్వే ఆదాయం వస్తుంది, రైల్వే స్టేషన్ ఎదురుగ మండల రెవెన్యూ ఆఫీసు, కోర్టు, త్రేసురి ఆఫీసు, ఫైర్ ఆఫీసు, మరియు స్వామి బుక్ స్తోరేస్, జిరోక్స్ షాప్ లు ఈ ఏరియా లోనే ఉన్నాయి.