Tuesday, September 9, 2008

Tuesday, June 3, 2008

నా గురించి

హాయ్, హలో ,
గిద్దలూరు ప్రజలందరికీ నా నమస్కారం
అందరికి నమస్కారం, నా పేరు చక్రధారి గడికోట, నేను పుట్టింది గిద్దలూరులోనే నేను ఎక్కువ కాలం చదివింది గిద్దలురులోనే , ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఒక పేరొందిన సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్ గా చేస్తున్నాను, ఎంతొ మంది తమ తమ సొంత ఊర్ల గురించి వేరే వాళ్ళకు తెలియడానికి ఇంటర్నెట్ ని వారధిగా ఉపయోగించుకొంటున్నారు, నేను కుడా మన ఊరి కోసం ఒక website ను స్టార్ట్ చేద్దాం అని ఒక ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి మీ సహాయ సహకారాలు నాకు అందిస్తారని ఆశిస్తూ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు తెలియ చేస్తారని మరియు గిద్దలూరు, గిద్దలూరు చుట్టుపక్కల వారూ గిద్దలూరుతో మీకు ఉన్నా అనుబంధాన్ని ఈ సైట్ ద్వార పంచుకుంటారని ఆశిస్తూ

మీ సోదరుడు
చక్రి గడికోట

Monday, May 19, 2008

పరిసర గ్రామాలు

గ్రామాలు
అంబవరము ఆదిమూర్తిపల్లె బొగద (నిర్జన గ్రామము) చట్టిరెడ్డిపల్లి గడికోట కొత్తపల్లి గిద్దలూరు ఇసుకగుండం గూడెం (నిర్జన గ్రామము) కంచిపల్లి కొమ్మునూరు కొంగలవీడు కొత్తకోట క్రిష్టంశెట్టిపల్లి మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) మోడంపల్లి ముండ్లపాడు నరసింహునిపల్లి నరవ పొదలకొండపల్లి సంజీవరావుపేట దేవనగరం
తంబళ్లపల్లి తిమ్మాపురం త్రిపురాపురం ఉయ్యాలవాడ

చరిత్ర -1

గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది. గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను.
పురాన చరిత్ర
1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు. ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి. ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.
చరిత్ర
గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశమునకు చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చెను. కానీ తరువాత ఈ గ్రామము పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లెను. ఆయన అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించెను.
శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు మరియు బారబలావతుల తో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చెను. తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జన మయ్యెను. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామము చుట్టూ అనేక కుగ్రామములు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామములు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె మరియు అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామములు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) గా ఎదిగినది.
హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామములను వెంకటాద్రి నుండి వశము చేసుకొనెను. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను మరియు దాని గ్రామాలను పరిపాలించినారు. రాయల పాలన ముగించడముతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురైనది. ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. ఆ తరువాత కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమైన 1971లో ఒంగోలు జిల్లా యేర్పాటు చేసినప్పుడు కొత్తగా యేర్పడిన జిల్లాలో కలపబడినది.

బొజ్జ వాసు స్పందన 3

కొత్త రూపములో మన బ్లాగ్ బోలెడు ఫొటోలతో సింగారించుకుని అందంగా ఉంది.కచేరి ఫోటో,నరసింహ స్వామి గుడి,కొండ ఇంకా కొండ మీద నుండి టాప్ యాంగిలులో టౌన్,కొండపేట ఆంజనేయ స్వామి గుడి,చర్చి(ఆర్ అండ్ బి ఆఫీసు పక్కన),నర్సరీ,ఆర్టీసీ బస్టాండ్, రాచర్ల కు వెళ్ళే దారిలో కొత్తగా వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి, థియేటర్ల ఫోటోలు కూడా పెట్టండి. ఫోటోలకి లింకులిచ్చి వేరే పేజీలో పెద్ద ఫోటోలు వచ్చే లాగ చేస్తే ఇంక ఉపయోగకరంగా వుంటుందేమో ఆలోచించండి. చాల చక్కగా, శ్రమతో బ్లాగుని తీర్చి దిద్దుతున్నందుకు అందుకోనండి మా అభినందన మందార మాల.

రవి వైజా సత్య స్పందన

శ్రీనివాస హాలు ప్రారంభించటం నాకు బాగా గుర్తు…మొదటి ఆట ఏదో కృష్ణ సినిమా వేశారు. అవును అప్పటికే వెంకటేశ్వర ఉన్నది

సుజాత స్పందన

మీకు దగ్గరలోని బనగానె పల్లెలో ఉన్న బ్రహ్మం గారి మఠం గురించి అక్కడ జరిగే కార్యక్రమాలగురించి కూలంకషంగా రాయండి.తెలుసుకోవాలని ఉంది.

బొజ్జ వాసు స్పందన 3

చక్రి, రెండవ ధియేటర్ శ్రీనివాస కాదు వెంకటేశ్వర! ఇంక బాస్కర్ థియేటర్ తరువాత సత్యనారాయణ ధియేటర్ ఉండేది, మీరు అది మరచి పోయారు.మీ పెద్ద వాళ్ళని అడగండి చెబుతారు.ఇంక బ్లాక్ గ్రౌండ్ మీద బ్లూ ఫాంట్ చదివే దానికి కష్టంగా ఉంది,మార్చండి.

బొజ్జ వాసు స్పందన 2

హాయ్,చక్రి గడికోట అభినందనలు! మీ ప్రయత్నం చాలా బావుంది.మీరు మీకు తెలిసినంత వరకు గిద్దలూరు ఇంక చుట్టూ పక్కల వూర్ల గురించి వ్రాయండి.తరువాత మీరు తెలుగు వికీపెడియా లో ఈ మొత్తము సమాచారాన్ని గిద్దలూరు శీర్షిక క్రింద వరుసగా వ్రాస్తే అందరికి ఉపయోగం మరియు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఒక చక్కటి రికార్డుగా ఉంటుంది. మీ కామెంట్ వ్రాయండి.PS:తెలుగు వికీపెడియా link : http://te.wikipedia.org

బొజ్జ వాసు స్పందన 1

గిద్దలూరు గురించి చాల చక్కగా వ్రాస్తున్నారు,ఇంక అక్కడి విశేషాలు ముఖ్యంగా కొండమీద స్వామి గురించి,పాతాళ నాగేశ్వర స్వామి గురించి వ్రాయండి. అభినందనలు!

Saturday, May 17, 2008

చక్రి గారికి రమేష్ శుభాకాంక్షలు

నా పేరు రమేష్ నేను చక్రి గారికి నా శుభాకాంక్షలు తను అనుకున్నది కన్న చాల ఎక్కువ చేయలిఅని మానస వాచా కర్మన కోరుకున్తునాను.. ఎలాగే చాల చాల మంచి మంచి పనులు చెయాలని ... అన్ని విడలలో దేవుడు సహాయ పదాలని కోరుకున్తునాను..
రమేష్
నాది చిన్న కోరిక.. ౪౫ సంవస్తరాలు .. చక్కటి సందేసాని అందించాలి అని కోరుతున్నాను

బొజ్జ వాసు స్పందన

Hi chakri...congratulations for opening one Blog for our Town.Please correct your posted letters year heading! It shows 2009 !!! may be it is 2007 right.One more suggestion is change your black background with Blue letters.Else every thing was Fine !!! Keep it up :)regdsVasu.Bojja

Monday, May 5, 2008

గిద్దలూరు ప్రధాన కూడళ్ళు 2

రైల్వే స్టేషన్ కు ఇంక ముందుకు వెళితే నల్లబండ రైల్వే గేటు వస్తుంది అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ గుడి అయ్యప్ప స్వాములతో రద్దిగా ఉంటుంది. ఈ ఏరియా లోనే హీరోహోండా షోరూం జయరాం లాడ్జ్, బాలగంగాదర ట్రావేల్స్ ఉన్నాయి. ఇంకోద్దిగా ముందుకు వెళితే రాచర్ల గేటు వస్తుంది ఇది ఎంతొ రద్ది ప్రదేశం ఇక్కడ నుండి నాలుగు దారులు ఉన్నాయి ఒక్కో దారి ఒక్కోక ఊరికీ వెళుతుంది, తూర్పుగా బెస్తవారిపేట కంబం రోడ్, పడమర నంద్యాల ఉత్తరం రాచర్ల దక్షిణం కొమరోలు అందువల్లు ఈ ప్రదేశం ఎంతొ రద్దిగా ఉంటుంది. ఇక్కడ రాచర్ల గేటు దాటి కొంచెం ముందుకు వెళితే కృష్ణ హాల్ సినిమా ధియేటర్ వస్తుంది, ఈ ఏరియా బాగా అభివృద్ది చెందుతున్న ప్రదేశం, రాచర్ల గేటు నుండి తూర్పుగా ముందుకు వెళితే అక్కడ వెంకటేశ్వర ధియేటర్, ఆర్ .ఆర్ హాస్పిటల్ , శివాజీ లాడ్జ్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వరుసగా హీరోహోండా, tvs శోరూమ్స్ , గిద్దలూరు ఆర్టిసి బస్ స్టేషన్, గిద్దలూరు పవర్ ఆఫీసు, ప్రక్కనే యమహ షోరూం, లారీ ఆఫీసులు ఉన్నాయి.

Sunday, May 4, 2008

సినిమా హాల్స్

గిద్దలూరు లో నాలుగు సినిమా థియేటర్లు ఉన్నాయి, అందులో మొదటగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ నలుగు థియేటర్లు లేనప్పుడు తాత్కాలికంగా భాస్కర్ టెంట్ హౌస్ పేరుతో రైల్వే స్టేషన్ కి అవతల ఆరు నెలల కొకసారి పేరు మారుస్తూ ఒక సినిమా హాల్ ఉండేది, కాలక్రమేణా టెంట్ హౌస్ స్థానం లో సినిమా హల్ల్స్ వెలసాయి . అందులో మొదటిది నటరాజ్ ధియేటర్ ఇది 1960 ప్రారంబం అయింది ఆ తరువాత ప్రస్తుత కాలంవరకు ఎప్పటికి అప్పుడు మార్పులు జరుపుకుంటూ ముందుకు వెళుతుంది ఈ సినిమా హాలు, ఇక రెండవ ధియేటర్ శ్రీనివాస ధియేటర్ ఇది అప్పట్లో పిడతల రంగ రెడ్డి గారు కట్టించారు, ఆ తర్వాత మూడవ ధియేటర్ వెంకటేశ్వర, ఈ హాల్ కూడా పిడతల రంగ రెడ్డి గారే నిర్మించారు. ఇక నాలుగవది 1990 తర్వాత కృష్ణ పిక్చర్ పాలస్ కట్టబడింది.