Sunday, May 4, 2008

సినిమా హాల్స్

గిద్దలూరు లో నాలుగు సినిమా థియేటర్లు ఉన్నాయి, అందులో మొదటగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ నలుగు థియేటర్లు లేనప్పుడు తాత్కాలికంగా భాస్కర్ టెంట్ హౌస్ పేరుతో రైల్వే స్టేషన్ కి అవతల ఆరు నెలల కొకసారి పేరు మారుస్తూ ఒక సినిమా హాల్ ఉండేది, కాలక్రమేణా టెంట్ హౌస్ స్థానం లో సినిమా హల్ల్స్ వెలసాయి . అందులో మొదటిది నటరాజ్ ధియేటర్ ఇది 1960 ప్రారంబం అయింది ఆ తరువాత ప్రస్తుత కాలంవరకు ఎప్పటికి అప్పుడు మార్పులు జరుపుకుంటూ ముందుకు వెళుతుంది ఈ సినిమా హాలు, ఇక రెండవ ధియేటర్ శ్రీనివాస ధియేటర్ ఇది అప్పట్లో పిడతల రంగ రెడ్డి గారు కట్టించారు, ఆ తర్వాత మూడవ ధియేటర్ వెంకటేశ్వర, ఈ హాల్ కూడా పిడతల రంగ రెడ్డి గారే నిర్మించారు. ఇక నాలుగవది 1990 తర్వాత కృష్ణ పిక్చర్ పాలస్ కట్టబడింది.

2 comments:

vasantam said...

చక్రి, రెండవ ధియేటర్ శ్రీనివాస కాదు వెంకటేశ్వర! ఇంక బాస్కర్ థియేటర్ తరువాత సత్యనారాయణ ధియేటర్ ఉండేది, మీరు అది మరచి పోయారు.మీ పెద్ద వాళ్ళని అడగండి చెబుతారు.ఇంక బ్లాక్ గ్రౌండ్ మీద బ్లూ ఫాంట్ చదివే దానికి కష్టంగా ఉంది,మార్చండి.

రవి వైజాసత్య said...

శ్రీనివాస హాలు ప్రారంభించటం నాకు బాగా గుర్తు...మొదటి ఆట ఏదో కృష్ణ సినిమా వేశారు. అవును అప్పటికే వెంకటేశ్వర ఉన్నది